ఒకసారి ఓ దట్టమైన అడవిలో దర్జాగా తిరిగే పులి ఉండేది. అడవిలో రాజులా జీవించే ఆ పులికి ఎవరి భయం లేదు. ఒకరోజు అది ఓ కట్టెలు కొట్టే మనిషిని చూసింది. అతనిపై దాడి చేయాలని అనుకున్న క్షణంలోనే, అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి అందం పులిని క్షణాల్లో మైమరపించింది. క్రూర జంతువు హృదయంలో అకస్మాత్తుగా ప్రేమ మొలిచింది. కొద్దిసేపటికి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోయినా, ఆమె రూపం మాత్రం పులి మనసులో నిలిచిపోయింది.
చివరికి పులి ధైర్యం చేసి చెట్టు చాటునుంచి బయటకు వచ్చి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడింది. పులిని చూసి వణికిపోయిన అతనికి అది మృదువుగా,
“భయపడకండి… మీకు హాని చేయను. మీ కూతురు నాకు నచ్చింది. మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను,” అంది. భయంతో ఉన్నప్పటికీ, కట్టెలు కొట్టేవాడు తెలివిగా ఆలోచించాడు.
“నాకు అభ్యంతరం లేదు. కానీ మా అమ్మాయి మీ కోరలు, గోర్లు చూసి భయపడుతుంది. వాటితో పెళ్లికి ఒప్పుకోకపోతే?” అన్నాడు.
ప్రేమలో మునిగిపోయిన పులి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
“మీ అమ్మాయి కోసం నా కోరలు, గోర్లు తీసేస్తాను,” అంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కట్టెలు కొట్టేవాడు వెంటనే పులి గోర్లు, దంతాలు తొలగించాడు. శక్తి, రక్షణలేని పులి ఇక సాధారణ జంతువే. వెంటనే కట్టెలతో, రాళ్లతో దాన్ని కొట్టి తరిమేశాడు.
ఆ దెబ్బతో పులి మళ్లీ ఎప్పుడూ మనుషుల దగ్గరకు వెళ్లలేదు.
నీతి:
అలోచించకుండా తీసుకున్న నిర్ణయం ఎంతటి బలవంతుడినైనా బలహీనుడిని చేస్తుంది.
ప్రేమైనా, నమ్మకమైనా – జాగ్రత్తగా వ్యవహరించాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















