టీ20 క్రికెట్లో ఇప్పటికే తన సత్తా చాటిన హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ.. ఇప్పుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ మెరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన తిలక్.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక పరుగులు సాధించి సౌత్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. బుధవారం ముగిసిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో నార్త్ జోన్‌ను ఓడించింది.
తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులతో ఆకట్టుకున్న తిలక్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక సమయంలో అజేయ అర్ధశతకం సాధించాడు. 79 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 181 పరుగుల విజయ లక్ష్యాన్ని సౌత్ జోన్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 43.1 ఓవర్లలోనే ఛేదించింది.
నాలుగో వికెట్‌కు తిలక్ వర్మ, రవిచంద్రన్ స్మరణ్ (32 నాటౌట్) కలిసి 80 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) కూడా జట్టు విజయానికి పునాది వేశారు. నార్త్ జోన్ బౌలర్లలో అబిద్ ముస్తాక్ 2/55తో రాణించాడు.
అంతకుముందు 256/7తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్ జోన్ 297 పరుగులకు ఆలౌటైంది. చివరి ముగ్గురు బ్యాటర్లను నిధీశ్ వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. అతడు 5/56తో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ 195 పరుగులకే పరిమితం కాగా.. సౌత్ జోన్ 312 పరుగులు చేసింది. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సౌత్ జోన్ ఇప్పుడు టైటిల్ కోసం ఈస్ట్ జోన్‌తో తలపడనుంది. దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం ప్రారంభం కానుంది.
టెస్టు క్రికెట్ అంటే తనకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టమని తిలక్ వర్మ తెలిపాడు. ఎర్ర బంతి క్రికెట్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తానని, సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు ఆడతానని తాను చిన్నప్పుడు ఊహించలేదని, అది దేవుడి ప్రణాళికగా భావిస్తున్నానని తిలక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ద్వారా టీ20లు, వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించిందని చెప్పాడు.
అయితే తన అసలు బలం ఎర్ర బంతి క్రికెట్టేనని తిలక్ స్పష్టం చేశాడు. పదేళ్ల వయసు నుంచే సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించేందుకు శ్రమిస్తున్నానని తెలిపాడు. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా గత మూడేళ్లు, నాలుగేళ్లుగా రంజీ ట్రోఫీలో ఎక్కువగా ఆడే అవకాశం దక్కడం లేదని చెప్పాడు.
రెడ్ బాల్ క్రికెట్లో ఇదే స్థాయిలో రాణిస్తూ.. భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమని తిలక్ వర్మ వెల్లడించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















