‘పూజ్యులు బంధుమిత్రులు, మా ఉన్నతికి తోడ్పడిన శ్రేయోభిలాషులకు ఇవే చివరి నమస్కారాలు. నేను, నా భార్య శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యాం. మా 26 సంవత్సరాల కుమారుడు సాయిసుకృత్ అమాయకుడు. ఆ కారణంగా మేం ముగ్గురం బలవన్మరణానికి పాల్పడుతున్నాం. ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు’’ అంటూ లేఖ రాసి భార్య, కుమారుడితో కలిసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని దువ్వూరులో సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
చీరాల మధుసూదన్‌రావు (65) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఐదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్ (26)తో కలసి దువ్వూరులో నివసిసున్నారు. కుమారుడు బీటెక్ చదివి తిరుపతిలో ఒక కంపెనీలో చేరారు. వరుసకు సోదరి అయ్యే దొరసానమ్మతో ఆదివారం సాయంత్రం మధుసూదన్‌రావు మాట్లాడారు. మామిడి పండ్లు కావాలని కోరగా.. సోమవారం తెస్తానని ఆమె చెప్పారు. సోమవారం వచ్చి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఆమె పొరుగు వారితో కలిసి తలుపులు తెరిచారు. దీంతో హాల్‌లో మధుసూదన్‌రావు, రత్నావళి, దేవుడి గదిలో సాయిసుకృత్ మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి. ముగ్గురికీ కాళ్లూచేతులూ కట్టేసి ఉన్నాయి.
మధుసూదన్‌రావు దంపతులకు సంతానం లేకపోవడంతో చిన్నప్పుడే సాయిసుకృత్‌ని ఆత్మకూరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి పెంచారు. బీటెక్ చదివించారు. తరువాత తిరుపతిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నా కంపెనీ వేతనం చెల్లించడం లేదు. గురువారం మధుసూదన్‌రావు దంపతులు ఆ కంపెనీకి వెళ్లి ఆరా తీయగా.. పనితీరు బాగాలేదని, సోమవారం వచ్చి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు వేదనకు గురయ్యారు. తాము మరణించాక బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోనన్న దిగులుతో శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భార్య, కుమారుడి కోరిక మేరకు అంటూ.. తమకున్న ఆస్తులను ఎవరెవరికి ఎలా పంచాలో మధుసూదన్‌రావు చనిపోవడానికి ముందు లేఖలో పేర్కొన్నారు. నెల్లూరులోని రెడ్‌క్రాస్ సొసైటీకి కొంత స్థలాన్ని ఇవ్వడం గమనార్హం. తమ అంత్యక్రియలకు ఓ సోదరి ఖాతాలో నగదు వేసినట్లు కూడా పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















