అమెరికా పతనం అంచున ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ పరిస్థితి తన పాలనలో కాకుండా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఏర్పడిందని విమర్శించారు.
ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, బైడెన్ పరిపాలనలో అమెరికా ఆర్థికంగా, భద్రత పరంగా తీవ్ర నష్టాలు చవిచూసిందన్నారు. ఓపెన్ బోర్డర్లు, అధిక పన్నులు, చెడు వాణిజ్య ఒప్పందాలు, పెరిగిన నేరాలు వంటి కారణాలతో దేశం బలహీనపడిందని ఆరోపించారు.
తన 16 నెలల పాలనలో అమెరికా అద్భుతమైన పురోగతి సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరడం, భారీ పెట్టుబడులు రావడం, వెనెజువెలా విషయంలో సైనిక విజయాలు, ఇరాన్‌పై చర్యలు వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించినందుకు జిన్‌పింగ్ తనను అభినందించాలని వ్యాఖ్యానించారు.
రెండేళ్ల క్రితం అమెరికా నిజంగానే పతనం అంచున ఉందని, కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని ట్రంప్ వెల్లడించారు. చైనాతో అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















