ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో భారీ కలకలం చోటుచేసుకుంది. Crude Oil ధరలు ఒక్కసారిగా ఊగిసలాటకు లోనవుతున్నాయి.యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్ ధర సుమారు 70 డాలర్ల వద్ద ఉండగా, ఉద్రిక్తతల పెరుగుదలతో ఒక దశలో 115 డాలర్లకు పైగా చేరింది. అనంతరం తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్)తో ధరలు 100 డాలర్ల దగ్గర స్థిరపడ్డాయి.
తాజాగా చర్చలు విఫలమవడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరించడంతో మార్కెట్‌లో భయాందోళనలు పెరిగాయి. ఈ మార్గం మూసివేయబడితే రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోతుందని అంచనావిశ్లేషకుల ప్రకారం, సరఫరా అంతరాయం ఎక్కువకాలం కొనసాగితే ముడిచమురు ధరలు 140–150 డాలర్ల వరకు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ధరలు సుమారు 99 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి.ఈ పరిణామాలపై ఆనిక్స్ క్యాపిటల్ గ్రూప్ (Onyx Capital Group) ఎండీ జోర్జ్ మోంటెపెక్యూ మాట్లాడుతూ, మార్కెట్ ప్రస్తుతం పూర్తి ప్రభావాన్ని ప్రతిబింబించడం లేదని, పరిస్థితులు మరింత దిగజారితే భారీ ధరల పెరుగుదల తప్పదని హెచ్చరించారు.
మన ఆర్థిక వ్యవస్థపై
భారత్ తన ముడిచమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటోంది. చమురు ధరలు పెరగడం వల్ల గత ఏడాది సుమారు 150 బి.డాలర్లుగా ఉన్న మన ఇంధన బిల్లు, ప్రస్తుత ధరలు కొనసాగితే 250 బి.డాలర్ల (సుమారు రూ.23 లక్షల కోట్లు)కు చేరే ప్రమాదం ఉంది. చమురు బ్యారెల్ ధర 120-140 డాలర్లకు చేరడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, దేశంలో ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. ఇది దేశ జీడీపీని నెమ్మదించేలా చేస్తుంది. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మార్గాల్లో అడ్డంకుల వల్ల మన దేశ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
స్టాక్ మార్కెట్, రూపాయి
ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో సోమవారం సెన్సెక్స్ ఒకదశలో 1,600 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ కూడా 23,600 దిగువకు చేరింది. ఆఖర్లో మళ్లీ కోలుకున్నా, సెంటిమెంట్ ఇంకా బలహీనంగానే ఉంది. చమురు ధరలు పెరిగే కొద్దీ రూపాయిపై ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లోని భారతీయులపై
గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 9 లక్షల మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ నిర్మాణం, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గడమే ఇందుకు కారణం. ప్రవాసులు పంపే నగదు (రెమిటెన్సెస్)పైనా ఇది ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాలకు ఇది పెద్ద దెబ్బే.
ప్రపంచ మార్కెట్ల పరిస్థితి
ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హర్మూజ్ మార్గం మూతపడటం వల్ల భారీ కొరత ఏర్పడింది. ఉదాహరణకు, గత వారాంతంలో 40 మంది చమురు కోసం అడిగితే, కేవలం నలుగురి అవసరాలు మాత్రమే తీరాయి. సోమవారం జపాన్ నిక్కీ, కొరియా కోస్పి దాదాపు 1% నష్టపోయాయి.
బ్యాంకింగ్ మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా అంచనా ప్రకారం.. ఈ పరిస్థితి 1973, 1979 నాటి చమురు సంక్షోభాల కంటే కూడా పెద్దదిగా మారొచ్చు. సామాన్య మదుపర్లు ఇటువంటి అస్థిర మార్కెట్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















