ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ శ్రేణి ధరలను సవరించింది. పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలు రూ.575 నుంచి రూ.11 వేల వరకు పెరిగాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ మోడళ్ల ధరల్లో మార్పులు చేసింది. 3.5kWh ఐక్యూబ్ ధర రూ.9 వేలు పెరిగి రూ.1.42 లక్షలకు చేరింది. 2.2kWh వేరియంట్ ధర రూ.5 వేల పెరుగుదలతో రూ.1.16 లక్షలకు చేరింది. ఐక్యూబ్ ఎస్ 4.7kWh ధర రూ.6 వేలు పెరగగా, ఐక్యూబ్ ఎస్‌టీ 5.3kWh ధర రూ.3 వేలు పెరిగింది.
టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యధికంగా రూ.11 వేల వరకు ధర పెరిగింది. ఆర్బిటర్ వీ1 ధర రూ.88,250 నుంచి రూ.99,250కి చేరుకోగా.. వీ2 ధర రూ.9 వేల పెంపుతో రూ.1.14 లక్షలకు చేరింది.
పెట్రోల్ స్కూటర్లలో జూపిటర్ 110 ధరలు వేరియంట్‌ను బట్టి రూ.575 నుంచి రూ.1,950 వరకు పెరిగాయి. జూపిటర్ 125 మోడల్ ధరలు రూ.875 నుంచి రూ.2,410 వరకు పెరిగాయి. ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్‌పై రూ.850 పెంచడంతో కొత్త ధర రూ.83,350గా మారింది.
కొత్త ధరలు ఎక్స్‌షోరూమ్ ధరలు మాత్రమేనని, ప్రాంతాలు, వేరియంట్లు, ఇతర సదుపాయాలను బట్టి తుది ధరల్లో మార్పులు ఉండవచ్చని కంపెనీ పేర్కొంది
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















