న్యూఢిల్లీ: గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు అనుమతించే దిశగా కేంద్ర రహదారులు, రవాణా శాఖ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు–1989లో మార్పులు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నిబంధనల పరిధిలో ద్విచక్ర అంబులెన్సులకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడంతో వాటి రూపకల్పన, నిర్వహణ, రోగుల తరలింపు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ పరీక్షలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవు.
ప్రతిపాదిత సవరణలు అమల్లోకి వస్తే ద్విచక్ర అంబులెన్సులు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి వస్తాయి. ఎల్2 కేటగిరీ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించే ప్రాంతాల్లో వీటి సేవలను అందించేందుకు అనుమతి ఉంటుంది.
ముఖ్యంగా రహదారి సౌకర్యాలు తక్కువగా ఉన్న గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను త్వరగా ఆసుపత్రులకు తరలించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నవారు 30 రోజుల్లోగా కేంద్ర రహదారులు, రవాణా శాఖకు తెలియజేయవచ్చు. వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















