యూకే ప్రభుత్వం శాశ్వత నివాసం (Permanent Residency) పొందే వలసదారుల కోసం నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. హోంశాఖ మంత్రి షబానా మహమూద్ ఈ మార్పులపై సూచనప్రాయంగా వెల్లడించారు.కొత్త ప్రతిపాదనల ప్రకారం శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసే ముందు కనీస నివాస గడువు ప్రస్తుతం ఉన్న 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని కేటగిరీల వలసదారులు అయితే 20 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి రావొచ్చు.
అర్హత ప్రమాణాలను కూడా మరింత కఠినతరం చేయనున్నారు. దరఖాస్తుదారులకు నేర చరిత్ర ఉండకూడదు, ఆంగ్ల భాషలో ఉన్నత స్థాయి నైపుణ్యం అవసరం. అలాగే గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కనీసం 12,570 పౌండ్లకు పైగా ఆదాయం ఉండాలని నిబంధనలు ప్రతిపాదించారు.
ఈ మార్పులు అమల్లోకి వస్తే తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగులు, శరణార్థులు, ఫ్యామిలీ వీసాదారులు, వర్క్ వీసాపై ఆధారపడినవారిపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా ఈ గడువు మారే అవకాశమూ ఉందని సమాచారం.మరోవైపు NHS నర్సులు, వైద్యులు మరియు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మాత్రం మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్యలోనే శాశ్వత నివాసానికి అర్హత పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















