కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు బాంబులు, తూటాలకు ఓట్లతో సమాధానం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా టీఎంసీ కార్యకర్తలు తమ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు.
దేశంలో నక్సలిజాన్ని మోదీ ప్రభుత్వం పూర్తిగా అణచివేసిందని, ఇప్పుడు చొరబాటుదారులను దేశం నుంచి బయటకు పంపే సమయం వచ్చిందని ఆయన అన్నారు. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.అలాగే మహిళల భద్రత అంశాన్ని ప్రస్తావిస్తూ, అర్ధరాత్రి కూడా మహిళలు భద్రంగా తిరిగే వాతావరణాన్ని బెంగాల్‌లో ఏర్పరుస్తామని హామీ ఇచ్చారు. ఆర్జీకర్ ఘటనలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















