అమెరికాలో ఇమిగ్రేషన్ ప్రక్రియను మరింత డిజిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆశ్రయం తదితర ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడాన్ని తప్పనిసరి చేసే కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
త్వరితగతిన సేవలు అందించడంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) పేర్కొంది. దీనికి సంబంధించిన నిబంధనను ఫెడరల్ రిజిస్టర్‌లో సోమవారం ప్రచురించింది.
కొత్త విధానం ప్రకారం సంబంధిత దరఖాస్తు విధానాలు ఆన్‌లైన్‌లో 180 రోజులపాటు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఆయా దరఖాస్తులకు ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విధానమే ప్రధాన మార్గంగా మారనుంది.
ఏ దరఖాస్తులకు వర్తింపు?
కొత్త విధానం కింద పలు కీలక ఇమిగ్రేషన్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో:
- గ్రీన్‌కార్డు దరఖాస్తులు, పునరుద్ధరణలు
- కుటుంబ ఆధారిత పిటిషన్లు
- అమెరికా పౌరసత్వ దరఖాస్తులు
- ఆశ్రయం కోసం దరఖాస్తులు
- ఉపాధి అనుమతి దరఖాస్తులు
- తాత్కాలిక రక్షిత హోదా (TPS)కు సంబంధించిన దరఖాస్తులు
ప్రస్తుతం చాలా మంది దరఖాస్తుదారులు USCIS ఆన్‌లైన్ ఖాతా ద్వారా సంబంధిత ఫారాలను పూర్తి చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ ప్రక్రియ మరింత విస్తృతం కానుంది.ఈ మార్పుతో ఇమిగ్రేషన్ దరఖాస్తుల నిర్వహణ వేగవంతం కావడంతో పాటు కాగితపు దరఖాస్తులపై ఆధారపడటం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















