పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్ ద్వీపానికి సమీపంలో ఓ ఇరాన్ చమురు నౌకపై అమెరికా క్షిపణి దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. నౌకపై నాలుగు ప్రాజెక్టైళ్లు దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ ప్రాంతంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పాటు పెద్ద ఎత్తున పొగ కమ్ముకున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. నౌకలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు Reuters పేర్కొంది. అయితే దాడికి గురైన నౌక పేరు, అది ఎక్కడికి వెళ్తోంది, దానిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు వంటి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ దాడిపై అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి తక్షణ అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఖర్గ్ ద్వీపానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఈ ప్రాంతంలో గతంలోనూ అమెరికా దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నాయి. ఇటీవల ఖర్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాజా ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే హోర్ముజ్ జలసంధి చుట్టూ నౌకల రాకపోకలు, చమురు రవాణాపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా ఇరాన్ చమురు నౌకపై దాడి జరగడంతో అంతర్జాతీయ చమురు సరఫరా, నౌకాయాన భద్రతపై ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నదానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















