ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజంగఢ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యతో పాటు ఇద్దరు మతగురువులను ఓ వ్యక్తి కాల్చి చంపాడు. అనంతరం తన ముగ్గురు పిల్లలను ఓ గదిలో బంధించి, వారిని కూడా చంపేస్తానని పోలీసులను బెదిరించాడు. దాదాపు ఏడు గంటలపాటు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితుల అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అజంగఢ్‌కు చెందిన అరవింద్ సింగ్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతడి భార్య బబితా సింగ్ (32) ఇద్దరు మతగురువులతో కలిసి ఇంట్లో మతపరమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇంట్లో జరుగుతున్న కార్యక్రమంపై అరవింద్ ప్రశ్నించడంతో భార్య, మతగురువులతో అతడికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మతగురువులు తమ ఆధార్ కార్డులు చూపించాలని అరవింద్ డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వాగ్వాదం తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన అరవింద్ తన లైసెన్స్డ్ తుపాకీతో భార్యతో పాటు ఇద్దరు మతగురువులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఇంటిని చుట్టుముట్టారు. నిందితుడిని లొంగిపోవాలని పదేపదే హెచ్చరించారు. అయితే ఇంట్లోకి పోలీసులు ప్రవేశిస్తే ముగ్గురు పిల్లలను కూడా చంపేస్తానని అరవింద్ బెదిరించినట్లు అధికారులు తెలిపారు.
పిల్లలకు ఎలాంటి హాని జరగకుండా పోలీసులు సుమారు ఏడు గంటలపాటు నిందితుడితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. బుధవారం తెల్లవారుజామున పోలీసులు గదిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. అరవింద్ వారిపై పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. నిందితుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
బబితా సింగ్ కొన్ని రోజులుగా అతీంద్రియ శక్తుల ప్రభావాన్ని తొలగించేందుకు ఇంట్లో మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వాటిని అరవింద్ వ్యతిరేకిస్తున్నాడని.. ఈ అంశమే కుటుంబంలో వివాదానికి కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















