తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ)గా నియమించిన జ్యోతిషుడు రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నియామకంపై అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
వెట్రివేల్‌కు సీఎం విజయ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందే టీవీకే విజయాన్ని ఆయన ఊహించారని, విజయ్ తరచూ జ్యోతిష సలహాలు తీసుకుంటారని సమాచారం. గతంలో జయలలిత సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలకు కూడా ఆయన సలహాదారుగా వ్యవహరించారు.
మంగళవారం ఆయనను రాజకీయ వ్యవహారాల ఓఎస్డీగా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వ్యవస్థలో జ్యోతిషుడికి కీలక పదవి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఈ వివాదంపై స్పందించిన సీఎం విజయ్.. నియామకాన్ని పునఃసమీక్షిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















