పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. మన సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు, పెట్టుబడిగా కూడా బంగారం (Gold)పై ఎంతోమంది నమ్మకం ఉంచుతారు. పసిడితో పాటు వెండికీ (Silver) మంచి డిమాండ్ ఉంది. అందుకే మార్కెట్‌లో ప్రతిరోజూ మారే బంగారం, వెండి ధరలను తెలుసుకోవడం అవసరం.తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో మారుతూ ఉంటాయి. డాలర్ మారకపు విలువ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో మార్పులు, దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు దేశీయ ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి.
బంగారం స్వచ్ఛత ఎలా గుర్తించాలి?
బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు.
- 24 క్యారెట్ల బంగారం (24 Carat Gold) అంటే 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం. ఇది ప్రధానంగా కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో లభిస్తుంది.
- 22 క్యారెట్ల బంగారం (916 Gold) నగల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలిపి దృఢత్వం పెంచుతారు.
22 క్యారెట్ల ధర తెలుసుకోవాలంటే 24 క్యారెట్ల ధరను 91.6 శాతంతో గుణించాలి.
ధరల్లో ఎందుకు తేడాలు?
కొన్ని దుకాణాలు పన్నులు, సుంకాలు కలపకుండా బంగారం ధరలను ప్రకటిస్తాయి. దీంతో ధర తక్కువగా కనిపిస్తుంది. కానీ బిల్లు వేయేటప్పుడు 3% జీఎస్‌టీ, ఇతర ఛార్జీలు కలిపితే అసలు ధర తెలుస్తుంది. ప్రాంతానికీ బంగారం రేటు ఒకటే అయినప్పటికీ, మేకింగ్ ఛార్జీలు, తరుగు ఛార్జీల్లో మాత్రం తేడా ఉంటుంది.
బిల్లు లేకుండా కొనడం మంచిదా?
కొంతమంది వ్యాపారులు జీఎస్‌టీ తప్పించుకోవచ్చని బిల్లు లేకుండా అమ్ముతామని చెబుతుంటారు. అయితే ఇలా కొనడం ప్రమాదకరం.
- బంగారం నాణ్యతపై హామీ ఉండదు
- మరమ్మతుల విషయంలో ఇబ్బందులు
- తిరిగి అమ్మేటప్పుడు సమస్యలు
అందుకే బంగారం కొనేటప్పుడు హాల్‌మార్క్, సరైన బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
వెండి ధరలూ గమనించాలి
వెండి కూడా పెట్టుబడిగా మంచి ఎంపికగా మారుతోంది. ముఖ్యంగా శుభకార్యాలు, గృహోపకరణాలు, నాణేలు, బార్ల రూపంలో కొనుగోలు పెరుగుతోంది. వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా మారుతూ ఉంటాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















