కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు పాత ఫోన్‌లోని వాట్సప్ చాట్స్, ఫొటోలు, వీడియోలను కొత్త ఫోన్‌లోకి తీసుకురావడానికి చాలామంది ముందుగా క్లౌడ్ బ్యాకప్ చేస్తుంటారు. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ వంటి సేవల్లో డేటాను భద్రపరిచి.. కొత్త ఫోన్‌లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మళ్లీ రీస్టోర్ చేస్తారు. అయితే వాట్సప్‌లోనే అందుబాటులో ఉన్న ‘చాట్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్‌తో ఈ ప్రక్రియను మరింత సులభంగా పూర్తి చేయవచ్చు.
పాత ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి ‘సెట్టింగ్స్’లోని ‘చాట్స్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘ట్రాన్స్‌ఫర్ చాట్స్’ను ఎంచుకుని ‘Start’పై క్లిక్ చేయాలి. దీంతో క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపిస్తుంది.
ఇక కొత్త ఫోన్‌లో వాట్సప్‌ను ఇన్‌స్టాల్ చేసి, నిబంధనలను అంగీకరించి.. పాత ఫోన్‌లో ఉపయోగించిన అదే ఫోన్ నంబర్‌తో లాగిన్ కావాలి. ఓటీపీ ద్వారా నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత డేటా ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుని కొత్త ఫోన్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్‌తో స్కాన్ చేయాలి.
రెండు ఫోన్లను కనెక్ట్ చేసేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చిన తర్వాత డేటా బదిలీ ప్రారంభమవుతుంది. చాట్స్, ఫొటోలు, వీడియోలు తదితర వాట్సప్ డేటా నేరుగా పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌లోకి వస్తుంది.
డేటా బదిలీ పూర్తయ్యే వరకు రెండు ఫోన్లను పక్కపక్కనే ఉంచి, వాట్సప్‌ను మూసివేయకుండా ఉండటం మంచిది. అలాగే రెండు ఫోన్లలో వైఫై, లొకేషన్ ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఈ పద్ధతి ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్, ఐఫోన్ నుంచి ఐఫోన్ బదిలీకి ఉపయోగపడుతుంది.
ముఖ్యమైన ప్రయోజనాలు :
- క్లౌడ్ బ్యాకప్ చేసి మళ్లీ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.
- ఇంటర్నెట్ డేటా వినియోగం తగ్గుతుంది.
- ఫోన్ టు ఫోన్ నేరుగా డేటా బదిలీ అవుతుంది.
- సమయం ఆదా అవుతుంది.
- అదనపు యాప్‌లు లేదా థర్డ్ పార్టీ సేవలు అవసరం ఉండవు.
- వాట్సప్ అందించే అధికారిక ట్రాన్స్‌ఫర్ విధానాన్ని ఉపయోగించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















