విటమిన్ ఎ అనేది కొవ్వులో కరిగే (ఫ్యాట్‑సాల్యబుల్) ముఖ్యమైన విటమిన్. ఇది శరీర ఆరోగ్యం, చూపు, చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తి పెంపులో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, యువతులకు విటమిన్ ఎ ఎంతో అవసరం.విటమిన్ ఎ రాత్రిపూట స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది. కంటిలోని రెటినాలో ఉండే రోడోప్సిన్ అనే పదార్థం ఏర్పడటానికి ఇది అవసరం. విటమిన్ ఎ లోపం ఉంటే రేచీకటి సమస్య రావచ్చు.
చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహించి, మొటిమలు, పొడి చర్మం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందుకే చర్మ సంరక్షణలో వాడే రెటినాయిడ్ క్రీములు, సౌందర్య చికిత్సల్లో విటమిన్ ఎను వినియోగిస్తారు.ఇక రోగనిరోధక శక్తి పెంపులో కూడా విటమిన్ ఎ కీలకం. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తికి దోహదపడటంతో శరీరం ఇన్‌ఫెక్షన్లకు ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పిల్లల్లో మీజిల్స్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
గర్భిణీ మహిళలలో శిశువు అవయవాలు—కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె సక్రమంగా ఎదగడానికి విటమిన్ ఎ అవసరం. అలాగే పాలిచ్చే తల్లుల్లో ఈ విటమిన్ అవసరం మరింత ఎక్కువ. ఎందుకంటే శిశువుకు తల్లిపాల ద్వారానే విటమిన్ ఎ అందుతుంది.విటమిన్ ఎ బీటా‑కెరొటిన్ రూపంలో శరీరంలో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో కూడా సహాయపడుతుంది.విటమిన్ ఎ లభించే ఆహార పదార్థాలు
విటమిన్ ఎ సాధారణంగా రెండు రూపాల్లో లభిస్తుంది:
1. రెటినాల్ (నేరుగా ఉపయోగపడేది):
లివర్, ఫిష్ ఆయిల్, గుడ్డు పచ్చసొన, పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి జంతు ఆహారాల్లో లభిస్తుంది.
2. బీటా‑కెరొటిన్ (శరీరంలో విటమిన్ ఎగా మారేది):
క్యారెట్, బత్తాయి, పాలకూర, ఆకుకూరలు, మామిడి, బొప్పాయి, బ్రాకలీ, క్యాప్సికం వంటి నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగు కూరగాయలు, పండ్లలో అధికంగా ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















