కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్‌పై నటి మాళవిక మోహనన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌తో కలిసి ‘మాస్టర్’ సినిమాలో నటించిన ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ అనుభవాలు, ఆయనతో ఉన్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మాళవిక మోహనన్ మాట్లాడుతూ, ‘మాస్టర్’ సినిమా మొదటి రోజు షూటింగ్‌లోనే తాను చాలా కష్టమైన సీన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తన డైలాగ్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టానని, కానీ విజయ్ మాత్రం ఎలాంటి క్లిష్టమైన సన్నివేశమైనా ఎంతో ప్రశాంతంగా, స్థిరంగా పనిచేస్తారని చెప్పారు. ప్రతి విషయాన్ని గమనిస్తూ పూర్తిగా పనిపై ఫోకస్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సరదాగా ఉంటారని, అవసరమైనప్పుడు ఫోన్ చేయగలిగే స్వేచ్ఛ ఇవ్వడం తనకు ఎంతో ఇంప్రెస్ చేశిందని అన్నారు.
విజయ్ క్రమశిక్షణ తనపై బలమైన ప్రభావం చూపిందని మాళవిక తెలిపారు. మోహన్‌లాల్, రజనీకాంత్, విజయ్ వంటి సీనియర్ నటులతో పని చేయడం వల్ల ఎన్నో విలువైన విషయాలు నేర్చుకోవచ్చని ఆమె చెప్పారు. ఉదయం 7 గంటలకు కాల్‌షీట్ ఉంటే ఆయన 6:55కే సెట్స్‌లో ఉండేవారని, ఇలా సమయపాలన పాటించడం వల్ల నిర్మాతలకు కూడా పెద్దగా నష్టం ఉండదని అభిప్రాయపడ్డారు.
అలాగే ‘మాస్టర్’ సినిమాలో విజయ్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రాలేదని, దాన్ని ఇప్పటికీ సరదాగా ఆయనతో చెబుతుంటానని మాళవిక నవ్వుతూ చెప్పారు. మొత్తంగా విజయ్‌తో పని చేయడం తన కెరీర్‌లో ఒక మంచి అనుభవంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















