అమెరికా–ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. క్షిపణి ఇంజిన్లు, అణు ఆయుధాల పరీక్షలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని దక్షిణ కొరియా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.వచ్చే వారంలో జిన్‌పింగ్ ఉత్తరకొరియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం చైనా సెక్యూరిటీ, ప్రొటోకాల్ బృందాలు ఇప్పటికే అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉత్తరకొరియా ప్రస్తుతం అణునిరాయుధీకరణ చర్చలకు ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో భద్రతా విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)పై దాడి జరిగితే తక్షణమే అణు ప్రతీకార చర్యలు చేపట్టే విధంగా కొత్త విధానాలు రూపొందించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్‌పై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ మార్పులు జరిగాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
ఇక చైనా, ఉత్తరకొరియాకు ఆర్థిక, రాజకీయ మద్దతు అందిస్తోందని, ఈ నేపథ్యంలో ట్రంప్–కిమ్ మధ్య మళ్లీ చర్చలు జరగడానికి జిన్‌పింగ్ మధ్యవర్తిగా ప్రయత్నించవచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.గతంలో 2019లో వియత్నాంలో ట్రంప్–కిమ్ భేటీ జరిగినప్పటికీ అణు నిరాయుధీకరణ విషయంలో ఒప్పందం కుదరక చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే స్థాయి చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలపై ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















