తూర్పు తీర ప్రాంతాల్లో పెరుగుతున్న తుపాన్లు, వాతావరణ మార్పుల ప్రభావాలను లోతుగా అధ్యయనం చేసేందుకు విశాఖలో కీలక అడుగు పడింది. Andhra University ప్రాంగణంలో ఆధునిక వాతావరణ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.భూవిజ్ఞాన మంత్రిత్వశాఖకు చెందిన Indian Institute of Tropical Meteorology ఆధ్వర్యంలో ‘అట్మాస్పియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ (ART)’ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ‘మిషన్ మౌసమ్’లో భాగంగా సుమారు రూ.180 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఈ నెలాఖరు నుంచే పరిశోధనలు ప్రారంభం కానున్నాయి.
ఈ కేంద్రంలో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, రసాయనాల ప్రభావం, ప్రజల ఆరోగ్యంపై వాటి ప్రభావం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. అలాగే రుతుపవనాల గమనం, మేఘాల ఏర్పాట్లు, భూమి ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి కీలక అంశాలను పరిశీలిస్తారు.పరిశోధనల కోసం ఇప్పటికే 38 రకాల అత్యాధునిక పరికరాలు విశాఖకు చేరాయి. తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వ్యూహాత్మకంగా విశాఖను కేంద్రంగా ఎంపిక చేశారు.
దేశంలో వాతావరణ పరిశోధనలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుకు సహకారం అందించనుంది. కేంద్ర-రాష్ట్ర స్థాయిలో శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశోధనలు నిర్వహిస్తారు. ఈ నెలాఖరులో రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరే అవకాశం ఉంది.ఈ కొత్త పరిశోధన కేంద్రం ద్వారా తీర ప్రాంతాల్లో కాలుష్యం, వాతావరణ మార్పులపై లోతైన అవగాహన పెరగడంతో పాటు, భవిష్యత్తులో తుపాన్లు వంటి విపత్తులను ముందుగానే అంచనా వేసే సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















