అగ్రరాజ్యం అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్‌తో తమకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తలదూర్చవద్దని డ్రాగన్ దేశం స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, ప్రపంచ శాంతికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
హర్మూజ్ జలసంధిలో చైనా నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ఆ ప్రాంతం ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని చైనా స్పష్టం చేసింది. ఇరాన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య, ఇంధన ఒప్పందాలను తాము తు.చ. తప్పకుండా గౌరవిస్తామని, ఈ అంతర్గత వ్యవహారాల్లో మూడో దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అమెరికాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ కీలక జలసంధి గుండా నౌకల రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని, యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చైనా విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. అమెరికా ఆంక్షలు లేదా దిగ్బంధనలు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని చైనా ఈ హెచ్చరిక ద్వారా పరోక్షంగా తెలియజేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















