తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
అదేవిధంగా నారాయణగిరి పార్కులో ఏర్పాటు చేసిన తొమ్మిది షెడ్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ దాటి బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు విస్తరించడంతో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కనిపిస్తోంది.
ఇక టైంస్లాట్ టోకెన్లతో వచ్చిన భక్తుల కోసం ఉన్న వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో కూడా ఆరు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వేసవి సెలవులు, వారాంతం, ప్రత్యేక పూజలు కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు, భద్రతా చర్యలను మరింత విస్తరించారు. భక్తులు సహనంతో ఉండి అధికారులకు సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















