ప్రఖ్యాత బాక్సింగ్ దిగ్గజం Mary Kom తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ టాక్‌షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో, ఈ అంశంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
ఎంతోకాలంగా తనలో పేరుకుపోయిన ఆవేదనతోనే ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరికైనా బాధ కలిగించాలన్నది తన ఉద్దేశం కాదని మేరీకోమ్ తెలిపారు.
“ఎన్నో సంవత్సరాలపాటు మా వైవాహిక జీవితం సజావుగానే సాగింది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధం చెడిపోయింది. 2025లో విడాకులు అయిన తర్వాత కూడా నాకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. అప్పుడు కూడా నేను సంయమనం పాటించాను” అని చెప్పారు.
ఇటీవల టాక్‌షోలో తాను మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలంటూ ఆమె కోరారు. ముఖ్యంగా పురుష సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు భావించి ఎవరికైనా బాధ కలిగితే అది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
“నా మాటలను వక్రీకరించారు. నేను ఏ ఆటకు వ్యతిరేకం కాదు. అన్ని క్రీడాకారులను గౌరవిస్తాను” అని ఆమె అన్నారు.
మేరీకోమ్ మణిపుర్‌కు చెందిన స్టార్ బాక్సర్. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె, మహిళా బాక్సింగ్‌లో అరుదైన ఘనతగా ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. అలాగే 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యురాలిగా కూడా సేవలందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















