అమరావతి – ఆంధ్రప్రదేశ్‌లో కమర్షియల్ కనెక్షన్లు ఉన్న ఎల్‌టీ విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ తీపికబురు చెప్పింది. గత కొంతకాలంగా అధికంగా వస్తున్న కరెంట్ బిల్లులపై స్పందించిన కమిషన్, కీలక నిర్ణయం తీసుకుంది.
ఎల్‌టీ వినియోగదారుల బిల్లులు పెరగడానికి ప్రధాన కారణం కేవీఏఆర్‌హెచ్ (Kilovolt Ampere Reactive Hour) ఫీచర్ అని ఏపీఈఆర్‌సీ తేల్చింది. ఈ నేపథ్యంలో డిస్కంలు కేవీఏఆర్‌హెచ్ ఫీచర్‌ను బ్లాక్ చేయాలని ఆదేశించింది.
అలాగే గతంలో ఈ ఫీచర్ కారణంగా వినియోగదారుల నుంచి వసూలు చేసిన అధిక బిల్లుల మొత్తాన్ని, ఇకపై జారీ చేసే బిల్లుల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. దీంతో కమర్షియల్ కనెక్షన్లు ఉన్న ఎల్‌టీ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది.
ఇంతకుముందు కేవీఏఆర్‌హెచ్ ఫీచర్‌ను అన్‌బ్లాక్ చేయడంతో పవర్ ఫ్యాక్టర్ మెరుగుదల కోసం కొందరు వినియోగదారులు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే సరైన అవగాహన లేకపోవడంతో రాత్రివేళ వాటిని ఆఫ్ చేయకపోవడం వల్ల రియాక్టివ్ పవర్ వినియోగం పెరిగి బిల్లులు అధికంగా వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన వినియోగదారులు డిస్కంలకు ఫిర్యాదులు చేయగా, కమిషన్ పరిశీలించి మళ్లీ కేవీఏఆర్‌హెచ్ ఫీచర్‌ను బ్లాక్ చేయాలని ఆదేశించింది.
ఈ నిర్ణయంతో ఇకపై కమర్షియల్ ఎల్‌టీ వినియోగదారులకు అధిక బిల్లుల భారం తగ్గనుందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















