తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఖాళీ స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని, ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మరికొన్ని చోట్ల పూర్తయ్యాయని వెల్లడించారు.మరో విడతలో అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన లేకపోయిందని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వం మాత్రం రాజకీయాలను పక్కనపెట్టి కేవలం అర్హులకే ఇళ్లు అందిస్తోందని స్పష్టం చేశారు.
ఇక డ్వాక్రా మహిళలకు గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ.23 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతులకు వరి పంటకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పాలన అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















