అమెరికా హెచ్‑1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగుల నియామకాల్లో పెరిగిన ఖర్చులు, ఆలస్యాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోనే తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో 20 వేల మంది ఉద్యోగులకు సరిపడే భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. ఇందుకోసం గూగుల్ మాతృక సంస్థ ఆల్ఫాబెట్ ఇప్పటికే ఒక ఆఫీస్ టవర్‌ను లీజుకు తీసుకోగా, మరో రెండు టవర్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మూడు టవర్ల విస్తీర్ణం కలిపి సుమారు 24 లక్షల చదరపు అడుగులుగా ఉంటుందని తెలుస్తోంది.
మొదటి టవర్‌లో రాబోయే కొన్ని నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభించనుండగా, మిగిలిన రెండు టవర్ల నిర్మాణం వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు సుమారు 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త క్యాంపస్ పూర్తిగా ప్రారంభమైతే, అమెరికా వెలుపల గూగుల్‌కు భారత్ కీలక కేంద్రంగా మారనుంది.
ఇక ఏఐ (కృత్రిమ మేధస్సు) రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో టెక్ కంపెనీలు భారత్‌పై మరింత దృష్టి సారిస్తున్నాయి. హెచ్‑1బీ వీసాలకు భారీ ఫీజులు విధించే కొత్త నిబంధనల కారణంగా, అమెరికాకు ఉద్యోగులను తీసుకెళ్లడం కంటే భారత్‌లోనే కార్యకలాపాలు నిర్వహించడం ఉత్తమమని పలువురు టెక్ దిగ్గజాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















