రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీఎస్‌డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖల పనితీరు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. అలాగే రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా సాంకేతికత వినియోగం, అవేర్ నెట్‌వర్క్, డేటా లీక్ నివారణ, పాలనలో ఏఐ టూల్స్ వినియోగం, కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్ ప్లాన్‌లపై చర్చించారు.యువతకు నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం అమలు, రాష్ట్రంలో ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. నెలవారీగా శాఖల వారీగా సమీక్షలు జరగాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని, రెండేళ్లలో అక్కడి నుంచి క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పాలనలోనూ, ఆర్థిక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు. సమావేశం ముగింపులో వివిధ శాఖల వారీగా సాధించిన పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

















