శనివారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జీఎన్‌టీ రోడ్డులో రామా థియేటర్ ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. ఏటీఎం యంత్రాన్ని రాయితో పగులగొట్టేందుకు ప్రయత్నించిన అతడు, అనంతరం ఇనుప ఊచతో కింద భాగంలోని డోర్‌ను తెరిచాడు. లోపల నగదు ఉన్న తలుపును తెరవాలని సుమారు 20 నిమిషాలపాటు శ్రమించాడు.
సీసీ కెమెరాల ద్వారా ఈ ప్రయత్నాన్ని గుర్తించిన బ్యాంకు కేంద్ర నిఘా విభాగం సిబ్బంది వెంటనే బ్రాంచి మేనేజర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ గీతారామకృష్ణకు సమాచారం చేరడంతో పోలీసులు, బ్యాంకు అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే చోరీ యత్నం విఫలమై పరారైన వ్యక్తిని గాలించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు జార్ఖండ్ చెందిన 35 ఏళ్ల రంజిత్‌కుమార్ జాదవ్‌గా గుర్తించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన అతడు, ఉద్యోగం రెగ్యులరైజ్ కాకపోవడంతో వదిలేశాడని తెలిపారు. గత రెండేళ్లుగా మానసికంగా స్థిరంగా లేడని ప్రాథమికంగా తెలిసింది.హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో సోదరుడి ఇంటికి వెళ్లిన రంజిత్, తిరుగు ప్రయాణంలో టికెట్ లేకుండా రైలు ఎక్కడంతో టీటీఈ తునిలో దించేశాడు. అనంతరం పట్టణంలో తిరుగుతూ నగదు అవసరంతో ఏటీఎం చోరీకి యత్నించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















