సినిమాల పరంగా సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పండగను లక్ష్యంగా చేసుకుని స్టార్ హీరోల సినిమాలు రావడం ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. తాజాగా Annapurna Studios 2027 సంక్రాంతికి తమ బ్యానర్ నుంచి ఓ సినిమా విడుదల కానుందని ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
హీరో ఎవరు, సినిమా పేరు ఏమిటి వంటి వివరాలు వెల్లడించకుండా.. ‘‘మూవీ రిలీజ్ డేట్‌ను మార్క్ చేసుకోండి’’ అంటూ అప్పుడే ప్రమోషన్ మొదలుపెట్టింది అన్నపూర్ణ స్టూడియోస్. ‘‘వాసివాడి తస్సాదియ్యా.. 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్‌ఫుల్ ఉంటుంది కదా’’ అనే క్యాప్షన్‌తో జనవరి 15, 2027న సినిమా విడుదల కానుందని ప్రకటించింది.ఈ పోస్టుతో అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సినిమా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హీరో Nagarjuna, దర్శకుడు Kalyan Krishna కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. తాజా అప్‌డేట్‌తో ఆ వార్తలకు బలం చేకూరినట్టైంది.
‘వాసివాడి తస్సాదియ్యా’ అనే డైలాగ్ ‘బంగార్రాజు’ సినిమాలో ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సాధించింది. అంతేకాదు, ‘‘సంక్రాంతికి సోగ్గాళ్లు’’ అనే పద ప్రయోగం కూడా ఆసక్తిని పెంచుతోంది. ‘బంగార్రాజు’లో Naga Chaitanya, నాగార్జున కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారా? లేక వేరే కథతో కొత్త ప్రాజెక్ట్ సిద్ధమవుతోందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.అక్కినేని హీరో ఎవరు, దర్శకుడు ఎవరు, కథ ఏంటన్న వివరాలు తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే 2027 సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చే ఈ సినిమా అక్కినేని అభిమానులకు పండగ వాతావరణాన్ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చనుందనే అంచనాలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















