శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గూడూరు రూరల్ మండలం కందలి సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.
పోలీసుల సమాచారం మేరకు, హరిత (35) బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ప్రయాణమధ్యలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న తర్వాత డ్రైవర్ అకస్మాత్తుగా ఆటో ఆపి కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమె ధరించిన బంగారు ఆభరణాలు అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు.
దాడిలో గాయపడిన హరితను వెంటనే స్థానికులు గూడూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















