గురువారం నమోదైన భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. బ్యాంకింగ్, లోహ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఏఐ సాంకేతికత, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల సరఫరా సహకారం కోసం ఏర్పాటైన ‘పాక్స్ సిలికా’ కూటమిలో భారత్ చేరనున్నట్లు వచ్చిన వార్తలు, అలాగే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి రావొచ్చని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.
నష్టాల్లోనే మొదలైనా..: ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 82,272.49 పాయింట్ల వద్ద నష్టాల్లో (క్రితం ముగింపు 82,498.14) ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికే లాభాల్లోకి వచ్చిన సూచీ ఒకానొక దశలో 83,132.08 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. చివరకు 316.57 పాయింట్ల లాభంతో 82,814.71 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 116.90 పాయింట్ల లాభంతో 25,571.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25,379.75 వద్ద కనిష్ఠాన్ని, 25,663.55 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 187.95 పాయింట్లు, నిఫ్టీ 100.15 పాయింట్లు చొప్పున పెరిగాయి.
ఎనిమిదే డీలా..: సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 8 మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ అత్యధికంగా 2.73 శాతం లాభపడగా.. ఎల్‌అండ్‌టీ 2.37%, హిందుస్థాన్ యునిలీవర్ 1.56%, బజాజ్ ఫైనాన్స్ 1.47%, పవర్‌గ్రిడ్ 1.44%, టాటా స్టీల్ 1.36%, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1.29% పెరిగాయి. మరోవైపు టెక్ మహీంద్రా 1.61%, ఇన్ఫోసిస్ 1.23%, ఎటెర్నల్ 1.10%, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 0.92%, మహీంద్రా అండ్ మహీంద్రా 0.53% నష్టపోయాయి.
పంట సంరక్షణ విభాగానికి సంబంధించి తన దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాలను అనుసంధానం చేసి ఒక్కటే సంస్థ కిందకు యూపీఎల్ తేనుంది. గ్రూపు వ్యవస్థను సరళీకృతం చేయడమే కాకుండా… అంతర్జాతీయంగా ఈ వ్యాపార వృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే లక్ష్యంతో ఈ చర్యను చేపట్టనుంది. పసిడి రుణాలు అందించే శాఖలను దాదాపు రెట్టింపు చేసి 500కు చేర్చినట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. వినియోగదార్లకు పసిడి రుణాల సేవలను మరింతగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని భావించి అదనంగా 245 శాఖలను జతచేసినట్లు పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















