చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే పూర్తయ్యే వరకు ఆగలేకపోవడం… కూల్‌డ్రింక్ బాటిల్ తెరిస్తే మొత్తం తాగేయడం… ఇది కేవలం మన స్వీయ నియంత్రణ లోపం మాత్రమే కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
Harvard University మరియు Duke University పరిశోధకుల అధ్యయనం ప్రకారం, ఒకప్పుడు పొగాకు కంపెనీలు వినియోగించిన వ్యూహాలను ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీ సంస్థలు కూడా అనుసరిస్తున్నాయి.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి?
ప్యాకెట్లలో లభించే చిప్స్, కుకీస్, తీపి పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి పదార్థాలు ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్’ కిందకు వస్తాయి. ఇవి ఎక్కువ రుచిగా ఉండేలా శుద్ధి చేసిన పిండి పదార్థాలు, అదనపు కొవ్వులు, ఉప్పు, చక్కెరలు, రుచికారకాలను అధికంగా ఉపయోగించి తయారు చేస్తారు.
మెదడుపై ప్రభావం
ఈ ఆహారాలు మెదడులో ఆనందాన్ని కలిగించే ‘రివార్డ్ సిస్టమ్’ను బలంగా ప్రేరేపిస్తాయి. దీంతో మళ్లీ మళ్లీ తినాలనే కోరిక పెరుగుతుంది. ఇదే పొగాకు వ్యసనానికి కారణమయ్యే విధానం కూడా. అందుకే ఈ చిరుతిళ్లు ఒకరకంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్త ఎందుకు అవసరం?
అధికంగా తీసుకుంటే ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ముప్పు
చిన్నారుల్లో అలవాటు వేగంగా పెరిగే ప్రమాదం
దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
అందుకే ప్యాకెట్ల ఆహారాల వినియోగంలో మితి పాటించాలని, సహజమైన ఆహారాలవైపు మొగ్గుచూపాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















