నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్నారా? అయితే దీన్ని చిన్న సమస్యగా తీసుకోవద్దు. తాజా పరిశోధనలు చెబుతున్నదేమిటంటే — నిద్రలేమి కారణంగా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులకూ ముందస్తు మధుమేహం (ప్రిడయాబిటిస్) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. జర్నల్ ఆఫ్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురితమైన దీర్ఘకాల అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ప్రిడయాబిటిస్ అంటే ఏమిటి?
ముందస్తు మధుమేహం అనగా రక్తంలో గ్లూకోజు స్థాయులు సాధారణ కంటే ఎక్కువగా ఉండటం. అయితే అవి పూర్తి స్థాయి మధుమేహంగా గుర్తించేంత ఎక్కువగా ఉండవు. కానీ ఈ దశను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో టైప్-2 మధుమేహంగా మారే ప్రమాదం ఉంటుంది.
నిద్రలేమి ఎలా ప్రభావితం చేస్తుంది?
- వేళకు పడుకోకపోవడం
- రాత్రిపూట తరచూ మెలకువ రావడం
- గాఢనిద్ర లేకపోవడం
ఈ కారణాల వల్ల గ్లూకోజును నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇన్సులిన్ హార్మోన్ పనితీరు తగ్గిపోతుంది. కణాలు ఇన్సులిన్‌కు సరైన స్పందన ఇవ్వకపోవడం వల్ల గ్లూకోజు కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే నిల్వ అవుతుంది. దీంతో పరగడుపున రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి.
జాగ్రత్తలు ఏమిటి?
- రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి
- ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి
- మొబైల్, టీవీ వాడకాన్ని నిద్రకు ముందు తగ్గించాలి
ఆరోగ్యమే మహాభాగ్యం
నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు… అది శరీర హార్మోన్ల సమతుల్యతకు, రక్తంలో చక్కెర నియంత్రణకు కీలకం. కాబట్టి కంటి నిండా నిద్రపోవడం ద్వారా ప్రిడయాబిటిస్ వంటి సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి మీ చేతుల్లోనే ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















