ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హైస్కూల్‌లో ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల బాత్రూంలో సిగరెట్లు తాగుతున్నారని మందలించిన ల్యాబ్ అసిస్టెంట్‌పై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడం కలకలం రేపింది.
పదవ తరగతి విద్యార్థి పునీత్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాత్రూంలో ధూమపానం చేస్తున్నారని సమాచారం అందడంతో ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్రరావు అక్కడికి వెళ్లి వారిని గట్టిగా హెచ్చరించారు. అయితే తమ తప్పును అంగీకరించాల్సింది పోయి, విద్యార్థులు రవీంద్రరావుపై పిడిగుద్దులతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి తరగతి గదిలో కూర్చున్నట్లు తెలిసింది.
ఈ విషయం తెలిసిన రికార్డు అసిస్టెంట్ రవిబాబు తరగతి గదికి వెళ్లి వారిని ప్రశ్నించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికీ ఆగ్రహంతో ఉన్న పునీత్ మళ్లీ దాడికి పాల్పడి రవీంద్రరావును కొట్టాడు. అదే సమయంలో ఘటనను వీడియో తీస్తున్న రవిబాబును కూడా తోసివేయడంతో ఆయన కిందపడిపోయారు.
ఈ ఘటనతో షాక్‌కు గురైన సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని గ్రామ పెద్దలు, స్థానికులు కోరుతున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















