విజయవాడ నగరంలో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పటికీ బుల్లెట్ ఛాంబర్‌లోకి రాకపోవడంతో కాల్పులు జరగలేదు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో నిందితుడు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన మురళిగా గుర్తించారు. అతడు ఎందుకు ఆయుధంతో తిరుగుతున్నాడు? నగరానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















