అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు సహాయం అందించేందుకు విదేశాంగ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయంఖతార్‌లోని భారత ఎంబసీ అత్యవసర సూచనలు జారీ చేసింది.
ఖతార్‌లో ప్రస్తుతం ‘హయ్య ఏ1 (Hayya A1)’ టూరిస్ట్ వీసా లేదా ఇతర తాత్కాలిక వీసాలతో ఉన్న భారతీయులు వెంటనే ఎంబసీ విడుదల చేసిన ఆన్‌లైన్ లింక్‌లో తమ వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఖతార్‌లో ఎంతమంది భారతీయులు ఉన్నారు, వారికి అవసరమైన సహాయం ఎలా అందించాలన్నది అంచనా వేయడం సులభమవుతుందని ఎంబసీ తెలిపింది.
‘హయ్య ఏ1 వీసా’ అనేది ఖతార్‌ను సందర్శించాలనుకునే విదేశీయులకు ఇచ్చే సింగిల్ ఎంట్రీ ఎలక్ట్రానిక్ వీసా. దీనిని ‘హయ్య వెబ్‌సైట్’ లేదా ‘హయ్య టు ఖతార్’ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాతో ఖతార్‌కు వెళ్లిన వారు గడువు ముగిసిన తర్వాత మరో 30 రోజులపాటు పొడిగించుకునే అవకాశమూ ఉంటుంది.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ఖతార్ నుంచి బయల్దేరాల్సిన అనేక అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దీంతో అక్కడ ఉన్న పలువురు భారతీయులు స్వదేశానికి తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశాల సహకారంతో భారత ప్రభుత్వం ప్రత్యేక విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక విమానాల ద్వారా ఖతార్ సహా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దశలవారీగా భారత్‌కు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















