మార్కెట్‌లో దొరికే కూల్‌డ్రింక్స్ కన్నా ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసుకునే పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి ఆరోగ్యకరమైన పానీయాల్లో కోకుమ్ జ్యూస్ ఒకటి. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. వేసవికాలంలో ఈ పానీయం తాగితే దాహం తీరటంతో పాటు శరీరం తాజాగా ఉంటుంది.
కోకుమ్ కాన్సన్‌ట్రేట్ తయారు చేయడానికి డ్రై కోకుమ్ పండ్లు, పంచదార, యాలకులు, వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు అవసరం. ముందుగా యాలకులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఎండు కోకుమ్ పండ్లను కొంతసేపు నీళ్లలో నానబెట్టి వాటిలోని విత్తనాలను తీసేయాలి. తరువాత వాటిని కొద్దిగా నీళ్లు కలిపి గ్రైండ్ చేసి వడకట్టాలి. మరోవైపు పంచదారలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. ఆ తరువాత వడకట్టిన కోకుమ్ రసం, జీలకర్ర పొడి, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి నెమ్మదిగా కలుపుతూ సన్నని మంటపై ఉంచాలి.
ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడే వరకు మరిగించి సగం నీళ్లు ఆవిరైపోయిన తర్వాత దించేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా ఉన్న గాలి చొరబడని సీసాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. తాగాలనిపించినప్పుడు ఒక గ్లాసు చల్లని నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ కోకుమ్ కాన్సన్‌ట్రేట్ కలిపితే చాలు. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కోకుమ్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదిగా ఉండటంతో పాటు సహజ రుచిని కూడా అందిస్తుంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews

















