దేశీయ మార్కెట్లు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమై భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు బ్రేక్ ఇవ్వడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. దీనికి అనుగుణంగా గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా స్పందించగా, అదే ప్రభావం దేశీయ సూచీలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో Sensex దాదాపు 1000 పాయింట్లకు పైగా ఎగబాకి ఉదయం 9.30 గంటల సమయంలో 73,775 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే Nifty 337.4 పాయింట్లు పెరిగి 22,848.80 వద్ద కొనసాగుతోంది. అయితే రూపాయి విలువ మాత్రం బలహీనంగానే ఉండి, మరో 18 పైసలు తగ్గి 93.71 వద్ద ట్రేడ్ అవుతోంది.
నిఫ్టీ సూచీలో Asian Paints – ఏషియన్ పెయింట్స్ Shriram Finance – శ్రీరామ్ ఫైనాన్స్ Titan Company – టైటాన్ కంపెనీ InterGlobe Aviation – ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ Grasim Industries – గ్రాసిమ్ ఇండస్ట్రీస్షేర్లు మంచి లాభాలను నమోదు చేస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగాల షేర్లు సుమారు 1–2 శాతం వరకు పెరిగాయి.
అటు ఆసియా–పసిఫిక్ మార్కెట్లు కూడా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 1.1%, దక్షిణ కొరియా కోస్పి 3%, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.32%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 1.6% వరకు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా సోమవారం లాభాలతో ముగిశాయి.ఇక చమురు మార్కెట్ విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 13% వరకు పడిపోయి 99 డాలర్ల వద్ద స్థిరపడటం గ్లోబల్ సెంటిమెంట్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లకు కూడా బలాన్నిస్తోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















