ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ వ్యవస్థ దరఖాస్తుదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డీపీఎంఎస్ (DPMS) 2.0 పోర్టల్ తీవ్ర సాంకేతిక లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. పారదర్శకత కోసం పాత వెర్షన్‌ను పక్కన పెట్టి కొత్తది తెచ్చినా, పరిస్థితి మెరుగుపడకపోగా మరింత జటిలమైంది.
భవన నిర్మాణాలకు సంబంధించిన 60 నుంచి 80 రకాల వివరాలను అప్‌లోడ్ చేయడం ఇప్పుడు ఎల్‌టీపీలకు (Licensed Technical Persons) ఒక పెద్ద యుద్ధంలా మారింది. సర్వర్లు మొరాయించడం, డాక్యుమెంట్లు సగం అప్‌లోడ్ అయ్యాక ఆగిపోవడం వంటి సమస్యలతో దరఖాస్తుదారులు రోజుల తరబడి కంప్యూటర్ల ముందే గడపాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం వంటి మహా నగరాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి.
ప్రభుత్వం “24 గంటల్లో అనుమతులు” అని ఆర్భాటంగా ప్రచారం చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం 24 రోజులైనా అడుగు ముందుకు పడటం లేదు. సాఫ్ట్‌టెక్ అనే ప్రైవేట్ సంస్థ ఈ పోర్టల్‌ను నిర్వహిస్తుండగా, పదేపదే సమస్యలు వస్తున్నా అధికారులు ఆ సంస్థపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కేవలం సాంకేతిక లోపాల వల్లే నిర్మాణ రంగం కుంటుపడుతోందని, అటు ప్రజలకు ఇటు బిల్డర్లకు ఈ జాప్యం తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పట్టణ ప్రణాళిక విభాగం స్పందించి ఈ ‘సాఫ్ట్’ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















