దిల్లీలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని ప్రధాని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రజా ప్రతినిధి వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.
“భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించడానికి అతి చేరువలో ఉంది. 21వ శతాబ్దంలో అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటిని దేశం తీసుకోబోతోంది” అని ప్రధాని మోదీ అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు ఇప్పుడు ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు.అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును సమర్థించి ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















