నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అది కేవలం రాజకీయ ప్రక్రియగా మిగలదని, పెద్ద ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు.
ఈ అంశంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, దక్షిణాది రాష్ట్రాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. జనాభా నియంత్రణతో పాటు అనేక రంగాల్లో పురోగతి సాధించిన రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరిగేలా పునర్విభజన ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రతిపాదిత పునర్విభజన వల్ల దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమవుతుందని కేటీఆర్ అన్నారు. పార్లమెంటులో ప్రజల స్వరాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు జరిగితే నిశ్శబ్దంగా ఉండబోమని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మృతి ఘటనపై కూడా కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వ బాధ్యతల వైఫల్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా కేటీఆర్ కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















