గాయని మంగ్లీ (సత్యవతి ముదావత్) తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేని వివాదాల్లో తన పేరును లాగడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని ఆమె తెలిపారు.ఈ కారణంగా గత నెల రోజులుగా తన కార్యక్రమాలు, రికార్డింగ్‌లు కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన పేరు ప్రతిష్ఠలకు నష్టం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మంగ్లీ, కాపు హేమకాంత్‌రెడ్డి, సింగపోగు సుబ్బారావు, రమావత్ మధులపై రాష్ట్ర అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
మంగ్లీ తరఫు న్యాయవాది కిషన్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ వివాదానికి గాయని మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని సంస్థల వ్యాపార వివాదాల్లో ఆమె పేరు అనవసరంగా లాగబడుతోందని తెలిపారు.మొత్తం మీద ఈ కేసులో నిజాలు బయటకు రావాలని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మంగ్లీ కోరారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















