చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని విపక్షం స్పష్టం చేసింది. అయితే, నియోజకవర్గాల పునర్విభజనతో ఈ అంశాన్ని హడావుడిగా ముడిపెట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేసింది.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన కీలక బిల్లులపై జరిగిన చర్చలో వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగొయ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటి సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చి వాటిని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదమైతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ప్రియాంక గాంధీ హెచ్చరించారు. ఇది రాజ్యాంగంపై బహిరంగ దాడి అని మండిపడ్డారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే మహిళలకు 33% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ ఆలోచన కాంగ్రెస్ కాలంలోనే ప్రారంభమైందని, 2018లో రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాశారని గుర్తుచేశారు. ఈ క్రెడిట్‌ను తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని భాజపాపై విమర్శించారు.
ఇక గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ, ఈ బిల్లుల పేరుతో ప్రభుత్వం డీలిమిటేషన్‌ను దొడ్డిదారిన అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ, భాజపా దీనిని రాజకీయ నినాదంగా మార్చిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లో ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.డీలిమిటేషన్ ప్రక్రియపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని నిర్ణయించడం రాజకీయ ప్రయోజనాలకే దారితీసే అవకాశముందని విపక్షం ఆందోళన వ్యక్తం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















