పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నప్పటికీ, అదే సమయంలో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన యంత్రాంగం చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి.హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌కు సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కైన్ హెచ్చరించారు. ఇరాన్ జెండా ఉన్న నౌకలు లేదా ఆ దేశానికి సహాయం చేసే సరకు తరలిస్తున్న నౌకలను ఎక్కడైనా గుర్తించి తనిఖీ చేసి, అవసరమైతే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
ఇరాన్‌కు సహాయపడే ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, లోహాలు వంటి సరకు రవాణా చేసే నౌకలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే హర్మూజ్ ప్రాంతంలో నౌకల రాకపోకలపై పరిమితులు విధించడంతో వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. రెండో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది.
ఇక భారతదేశం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాసలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, హర్మూజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరు పక్షాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చారు. సముద్ర భద్రత భారత ఇంధన, ఆర్థిక ప్రయోజనాలకు కీలకమని ఆయన గుర్తుచేశారు.ఈ ఘర్షణల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను కూడా ఆయన ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ దౌత్య మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















