ఇప్పటి జీవనశైలిలో మెడ నొప్పి చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా రోజంతా కూర్చొని పనిచేసే వారు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. కొందరికి మెడ నొప్పితో పాటు తరచూ తలనొప్పి కూడా ఉంటుంది. అయితే ఈ మెడ నొప్పి మెదడుకు హాని చేస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
నిపుణుల ప్రకారం, మెడలోని ఎముకలు (సర్వైకల్ వెర్టిబ్రా), డిస్కుల్లో మార్పులు వచ్చినప్పుడు నరాలపై ఒత్తిడి పడుతుంది. ఈ నరాలు మెదడుతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి, ఆ ఒత్తిడి తలకు చేరి తలనొప్పి కలిగిస్తుంది. అందుకే మెడ నొప్పితో బాధపడే చాలా మందికి తలనొప్పి కూడా వస్తుంది. అయితే, సాధారణంగా మెడ నొప్పి వల్ల నేరుగా మెదడు దెబ్బతింటుందని చెప్పలేము.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
- తరచు తలనొప్పి రావడం
- తల బరువుగా అనిపించడం
- మెడ నొప్పి పెరగడం
- కొన్నిసార్లు తేలికగా తలతిరగడం
ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. కొందరు దీన్ని సాధారణ నొప్పిగా నిర్లక్ష్యం చేస్తారు, కానీ అది సమస్యను పెంచవచ్చు.
ప్రమాదకరం కావచ్చు?
మెడ నొప్పి తీవ్రంగా ఉంటే, నరాలపై ఒత్తిడి పెరిగి నిరంతర తలనొప్పి లేదా మైగ్రేన్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. కొందరిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారు, రోజూ బైక్‌పై ప్రయాణించే వారు, విటమిన్ D, B12 లోపం ఉన్న వారు, మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించే వారు జాగ్రత్తగా ఉండాలి.
ఎలా నివారించాలి?
- విటమిన్ D, B12 స్థాయిలను సరైన స్థాయిలో ఉంచుకోవాలి.
- ప్రతిరోజూ తేలికపాటి మెడ వ్యాయామాలు చేయాలి.
- కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌ను కంటి స్థాయిలో ఉంచుకోవాలి.
మెడ నొప్పి నేరుగా మెదడును దెబ్బతీయదు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే తలనొప్పి వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















