హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై భాజపా వైఖరిని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లు పేరుతో రాజకీయ నాటకం ఆడిందని, దేశ ప్రజలు అన్నీ గమనించారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా, భాజపా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని వృథా చేసిందన్నారు.
డీలిమిటేషన్ అంశాన్ని అనవసరంగా జోడించడం వల్లే బిల్లు క్లిష్టతరమై నిలిచిపోయిందని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, కానీ ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టించారని ఆరోపించారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఇప్పటికే అనేక పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ అంశాన్ని పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళ్లడం వల్ల చారిత్రాత్మక అవకాశం కోల్పోయామని అన్నారు. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా కొత్త మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు రాష్ట్ర హక్కు అని కేటీఆర్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, అస్సాంలో సీట్ల పెంపు చేపట్టిన కేంద్రం తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. 2028లోపు అసెంబ్లీ సీట్ల పెంపుకు ప్రత్యేక బిల్లు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















