ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరుగుతోందని హెచ్చరించింది. గురువారం (23-04-2026) రాష్ట్రంలోని 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి కూడా 50 తీవ్ర వడగాలులు, 52 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
బుధవారం రోజున కడప జిల్లాలో అత్యధికంగా 44.4°C ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 202 మండలాల్లో 41°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేపు తీవ్ర వడగాలులు ప్రభావం చూపే జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాలు ఉన్నాయి.
అలాగే బుధవారం రోజున మన్యం జిల్లా సాలూరు, నంద్యాల ఆళ్లగడ్డ, శ్రీకాకుళం కొత్తూరు, విజయనగరం దత్తిరాజేరు, అనంతపురం రాయదుర్గం, ప్రకాశం కొప్పెరపాడు, అనకాపల్లి దేవరపల్లె, తిరుపతి బేస్తపల్లి, కాకినాడ కరప, విశాఖ పద్మనాభం వంటి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, తాగునీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
అలాగే ఆకస్మిక వర్షాలు లేదా ఉరుములతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అత్యవసర సమాచారం కోసం 112, 1070, 1800 425 0101 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















