హైదరాబాద్ నార్సింగి ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన మూడున్నరేళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రాజపుష్ప ప్రొవిన్షియా బ్లాక్-ఎఫ్‌లో నివసించే వ్యాపారవేత్త మల్లపు దినేష్‌రెడ్డి కుమారుడు రిషాన్‌రెడ్డి ఈ నెల 16న ఉదయం ఆడుకుంటూ వెళ్లి క్లబ్‌హౌస్ సమీపంలోని ఈతకొలనులో పడిపోయాడు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు నగరంలోని చిన్నపిల్లల ఆస్పత్రికి మార్చినా, బాలుడి పరిస్థితి విషమంగానే కొనసాగింది.
చికిత్స ఫలించకపోవడంతో బుధవారం బాలుడిని ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించగా, ఇంటికి తీసుకువెళ్తుండగానే అతను మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించగా, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















