రాష్ట్రంలో బార్‌లు అర్ధరాత్రి 12 గంటలకు మూసేశారో లేదో నిర్ధారించేందుకు కానిస్టేబుళ్లు స్వయంగా వెళ్లి ఫొటోలు తీసి ‘ఎక్సైజ్ ఐ’ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిన నిబంధనను ఎక్సైజ్ శాఖ సడలించింది. ఇకపై బార్‌ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించడం లేదా బార్ ప్రతినిధితో వీడియో కాల్ ద్వారా మూసివేతను నిర్ధారించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇంతకుముందు ప్రతి రోజు ఉదయం బార్‌లు తెరవక ముందు, అలాగే రాత్రి మూసిన తర్వాత కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండేది. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వెళ్లి ఫొటోలు తీయడం సిబ్బందికి తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా సీతమ్మధార పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఎల్. సింహాచలం నాయుడు విధి నిర్వహణలో భాగంగా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటన అనంతరం ఉద్యోగ సంఘాలు నిబంధన సడలించాలని డిమాండ్ చేయడంతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎక్సైజ్ శాఖ నుంచి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు అందించాలని, ఎస్‌బీఐ బీమా పథకం ద్వారా రూ.1.10 కోట్లు ఆర్థిక సాయం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో కానిస్టేబుళ్లకు ఉపశమనం లభించడంతో పాటు, విధి నిర్వహణలో భద్రతా పరమైన సమస్యలు కూడా తగ్గనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews
















