ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 11 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికినట్లైంది.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధ్యయనం చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే గుర్తింపు సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మిగతా అంశాలను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కలిసి పరిష్కరించుకోవాలని సమావేశంలో తీర్మానించారు.
శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. చర్చలు సఫలమవడంతో శనివారం ఉదయం తొలి షిఫ్ట్ నుంచే బస్సులు యథావిధిగా రోడ్డెక్కనున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మిక సంఘాలు కూడా ఒప్పందంపై సంతృప్తి వ్యక్తం చేశాయి.
ఐకాస నాయకులు ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు ఉంచగా, ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరిగింది. వేతన సవరణ, ఉద్యోగుల విలీనం, డీఏలు, బకాయిలు వంటి అంశాలను కార్మిక సంఘాలు ప్రస్తావించాయి. ప్రభుత్వం పలు అంశాలకు సానుకూలంగా స్పందించింది.
సమావేశ ప్రారంభంలో నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి నివాళిగా రెండు నిమిషాల మౌనం పాటించారు. ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్టీసీ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అని, ఉద్యోగులు, ప్రభుత్వం కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది ప్రజల ప్రభుత్వం అని, ఎవరినీ శత్రువులుగా చూడబోమని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















