Indian Institute of Management Mumbai కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) డిజిటల్ సైన్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు టెక్నాలజీ మరియు మేనేజ్‌మెంట్‌ను కలిపి “టెక్నో-మేనేజర్స్”ను తయారు చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది.
ఈ నాలుగేళ్ల కోర్సులో మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించబడుతుంది. ఆగస్టు చివరి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కోర్సు ఫీజు నాలుగేళ్లకు సుమారు రూ.31.20 లక్షలు.
ప్రవేశానికి JEE Main స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు అవసరం.
ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక డిజిటల్ టెక్నాలజీలు బోధిస్తారు. అలాగే మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రాటజీ వంటి బిజినెస్ మేనేజ్‌మెంట్ అంశాలు కూడా నేర్పిస్తారు.
కోర్సులో చేరిన విద్యార్థులు ఏడాది తర్వాత బయటకు వస్తే సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత డిప్లొమా, మూడేళ్ల తర్వాత అడ్వాన్స్‌డ్ డిప్లొమా, నాలుగేళ్ల తర్వాత పూర్తి బీఎస్ డిగ్రీ పొందుతారు. తర్వాత ఎంబీఏ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు డేటా అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఆపరేషన్స్ మేనేజర్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15 కాగా, ఇంటర్వ్యూలు జూన్ చివర లేదా జులై ప్రారంభంలో జరుగుతాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















